ప్రస్తుతం సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది తనకు వరసగా మూడో హిట్టు.గత ఏడాది దసరా,హాయ్ నాన్న లతో వరసగా బ్లాక్ బాస్టర్ చూశాడు.ఇక ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సరిపోదా శనివారం తరువాత నాని నెక్స్ట్ హిట్ 2 సీక్వెల్ హిట్ 3 ను స్టార్ట్ చేయనున్నాడు.సూపర్ హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్నాడు.సెప్టెంబర్ 9న సెట్స్ మీదకు వెళ్లనుంది.హైదరాబాద్ తో సహా గోవా,ఢిల్లీ, ముంబై , కోల్కత్తా ,కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకోనుంది.ఈసినిమాను నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై నిర్మించనున్నాడు.త్వరలోనే హిట్ 3 గురించి అఫీషియల్ అనౌన్స్ రానుంది.
హిట్ 3 కాకుండా నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.ఈసినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.దసరా లాగే ఇది కూడా మాస్ ఎంటర్టైనర్.వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: