ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తుండగా అతినికి జోడిగా రష్మిక మందన్న కనిపించనుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం ధనుష్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాకు రాక్ స్టార్ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఇక కుబేర తెలుగు తో పాటు తమిళ,కన్నడ ,మలయాళ ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.అన్ని కుదిరితే ఈఏడాది చివర్లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























