మంచి అంచనాల మధ్య నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం సరిపోదా నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 24.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంటుంది.దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 20శాతం కుపైగా రికవరీ చేసింది.అయితే దసరా ఓపెనింగ్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది.ఇక ఈరోజు కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా రానున్న రెండురోజుల్లో ఇదే జోరును కొనసాగించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వారాంతంలో 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.మరి ఫుల్ రన్ లో సరిపోదా ఎంత రాబట్టుకుంటుందో చూడాలి.వచ్చే వారం వరకు పోటీ లేకపోవడం కలిసిరానుంది.అటు ఓవర్సీస్ లో సరిపోదా శనివారం సత్తాచాటుతుంది.ప్రీమియర్స్ తో కలుపొకొని మొదటి రోజు 850k డాలర్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజు తో 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.నానికి ఇది 10వ మిలియన్ డాలర్ మూవీ.
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: