యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ కానున్నాడని ఆయన తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం నటీనటులను ఫైనల్ చేసే పనిలో వున్నారు మేకర్స్.రవి బసృర్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.లాంచ్ రోజే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు.2026 జనవరి 9న ఈసినిమా విడుదలకానుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్నాడు.అయాన్ ముఖర్జీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలకన్నా ముందు ఎన్టీఆర్, దేవర తో పలకరించనున్నాడు.ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే మూడో పాటనురిలీజ్ చేయనున్నారు.ఈసాంగ్ కూడా అదరగొట్టనుందని టాక్.కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ అర్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: