ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలారా 2’. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ ‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించి గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఫరియా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అలాగే కమెడియన్ సత్య కీలక పాత్రలో నటిస్తుండగా.. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
కాగా సినిమాలో ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోందని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం గ్యారంటీ అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ‘మత్తు వదలరా 2’ నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే హిలేరియస్‌గా ఉంది. హీరో శ్రీ సింహా, ఫిమేల్ లీడ్ ఫరియా అబ్దుల్లా ఫుల్ యాక్టివ్ మోలో కనిపించరు. ఇక వెన్నెల కిశోర్, సత్య రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి. వారి కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాక్షన్ సీన్స్ అండ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: