బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. ఆహ్వానం అందుకున్న అల్లు అర్జున్‌

Icon Start Allu Arjun Invited For Nandamuri Balakrishna's Golden Jubilee Celebrations

టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో 50 కనీవినీ ఎరుగని రీతిలో ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరగబోయే వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

ఇదేక్రమంలో తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందించారు నిర్వాహకులు. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆయనను కోరగా.. అందుకు అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్.. బాలకృష్ణ గారి గురించి, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది.

కాగా అల్లు అర్జున్‌ను కలిసినవారిలో తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు తదితరులు వున్నారు.

ఇక ఇప్పటివరకూ 108 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.