సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హ్యాట్రిక్ పై కన్నేశాడు. దీనిలో భాగంగా ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా ‘స్వాగ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘రాజ రాజ చోర’ మూవీ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే వున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్వాగ్ నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ టీజర్ హైలైట్స్ ఒకసారి చూస్తే..
శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజమర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది.
అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు.. కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. టీజర్‌లో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి.
వేదరామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ పుల్‌గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. క్రేజీ అండ్ ఫన్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.
ఇక శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ గా ఉంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈసారి, వారు యూనిక్ బ్యాక్ డ్రాప్ లో బలమైన కథతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు టచ్ చేయని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: