రాజ రాజ చోర తరువాత హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్. ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది ఈసినిమా.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈటీజర్ చాలా కొత్తగా అనిపించి సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈచిత్రం.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీతూ వర్మ, మీరా జాస్మిన్,దక్షా నాగర్కర్,శరణ్య ప్రదీప్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.దసరాకి విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది.తెలుగు రాష్ట్రాలకు గాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది.
మరోవైపు వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు హీరో శ్రీ విష్ణు.అందులో భాగంగా గత ఏడాది సామజవరగమన తో వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు స్వాగ్ తో రానున్నాడు.మరి ఈసినిమాతో శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: