గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్ర చేశాడు.ఇక రజనీ హీరోగా వేట్టాయాన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం రజినీకాంత్,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం వైజాగ్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇక ఈసినిమా కోసం మలయాళ నటుడుని కీలక పాత్ర కోసం తీసుకున్నారు.ఇంతకీ అతనెవరంటే మంజుమ్మల్ బాయ్స్ లో కీలక పాత్రలో కనిపించిన సౌబిన్ షరీబ్.కూలీ లో తను సౌబిన్ దయాల్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఈరోజు మరోక పాత్రను పరిచయం చేయనుంది కూలీ టీం.
లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రజినీ స్టైలిష్ గా కనిపించనున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: