సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం నాగార్జున ఈసినిమాతో పాటు కుబేరలో కూడా నటిస్తున్నాడు.ఇందులో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.ఆల్మోస్ట్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు.త్వరలోనే కూలీ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.
ఇక కూలీ నుండి రేపు మరో పాత్రను పరిచయం చేయనున్నారు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.లోకేష్ మేకింగ్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి సినిమాను డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలచేయనున్నారు.అటు జైలర్ తో రజినీ కమ్ బ్యాక్ ఇవ్వడం అలాగే విక్రమ్ ,లియో తో లోకేష్ పీక్ సక్సెస్ లో ఉండడం ఇప్పుడు నాగార్జున కూడా జాయిన్ కావడంతో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: