అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ హిలేరియస్‌గా ఉండి మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. ఎక్కువ వ్యూస్‌తో ఇండియా వైడ్‌గా నం.1 స్థానంలో దూసుకుపోతోంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో దీనిగురించి స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు.
జనక అయితే గనక ట్రైలర్‌ను గమనిస్తే.. సుహాస్‌కు పెళ్లైనప్పటికీ పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటాడు. దీనికి కారణం, ఖర్చులు పెరిగిపోతాయనేది అతని భయం. అయితే భార్యకు ఏం చెప్పి మెనేజ్ చేస్తున్నాడనేది ఎవరికీ అర్థం కాదు. అతని కుటుంబ సభ్యులందరూ పిల్లలు కనమని అతడికి పోరు పెడుతుంటారు.
ఎవరు ఎంత బలవంతం చేసినప్పటికీ అందరికీ సర్ది చెప్పేస్తుంటాడు. ఈ విషయాలను మంచి కామెడీ సన్నివేశాలతో చూపించారు. ఇలాంటి మనస్తత్వమున్న హీరోకి తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? మధ్య తరగతి వ్యక్తి అయిన హీరో ఎవరిపై కేసు వేస్తాడు? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
కాగా ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్ గాంధీ పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే మరోవైపు సుహాస్ బాబీ దర్శకత్వంలో ‘గొర్రె పురాణం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: