స్వాగ్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌లో ఇప్పటివరకూ రాలేదు

Hero Sree Vishnu Says, A Movie Like Swag Never Came on Indian Screen Till Now

కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోరా’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా ‘స్వాగ్’ తో అలరించబోతున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మగ మహారాజులకు, మకుటం లేని మహారాణులకు స్వాగనిక వంశానికి స్వాగతం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్ గోలీకి చాలా థాంక్స్. చాలా గొప్ప కథ ఇది. ఇండియన్ స్క్రీన్‌లో ఇప్పటివరకూ ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది మన అందరి ఇళ్ళలో వున్న పాయింట్ అయినా స్క్రీన్ పైకి ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి కంటెంట్ ని సినిమా చేయడానికి ముందుకువచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. టీంలో అందరికీ థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అని తెలిపారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వేదరామన్ శంకరన్, ఎడిటర్‌గా విప్లవ్ పనిచేస్తుండగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.