అంటే సుందరానికి తరువాత న్యాచురల్ స్టార్ నాని పీక్ సక్సెస్ ను చూస్తున్నాడు.రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటిటి లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పరాభవం నుండి వెంటనే తేరుకొని దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాని.గత ఏడాది సమ్మర్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆ తరువాత అదే ఏడాది చివర్లో హాయ్ నాన్న తో వచ్చి నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సక్సెస్ స్ట్రీక్ కొనసాగుతూనే వుంది.నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం ఈ రోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.దాంతో వరసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ ను పూర్తి చేయనున్నాడు నాని.తొలి రోజు బుకింగ్స్ కూడా బాగానే వున్నాయి.ఎలాగూ టాక్ కూడా బాగుండడం తో నైట్ షోస్ హౌస్ ఫుల్ కానున్నాయి.అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది.ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఓవరాల్ గా మొదటి రోజు సరిపోదా శనివారం 10 నుంచి 15కోట్ల మధ్య లో వసూళ్లను రాబట్టుకోనుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో నాని తోపాటు ఎస్ జె సూర్య రోల్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,స్క్రీన్ ప్లే హైలైట్ అయ్యాయి.వివేక్ ఆత్రేయ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.మొత్తానికి అంటే సుందరానికీతో నానికి డిజాస్టర్ ఇచ్చిన వివేక్ సరిపోదా తో బ్లాక్ బాస్టర్ ఇవ్వనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: