
ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 3


ఏప్రిల్ నెలలో సినిమాల సందడి

ఏప్రిల్ 2 రిలీజ్ సినిమాలు
బ్రహ్మీ-కోవై సరళ కామెడీ సీన్స్
పెళ్లి చూపులు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ ట్రైలర్స్

IIT కృష్ణమూర్తిలో ఏముంది.?

'VIP2' ధనుష్ కామెడీ సీన్
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా

అమెజాన్ లో వచ్చేసిన 90ML
అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన 'సాహో'

ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్

`మహానటి` తరువాత మరోసారి...

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా తప్పకుండా చూడడానికి ఉసిగొలిపే అంశాలు
గత కొంత కాలంగా విభిన్న కథలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆలవాలం అయింది. ఇప్పుడు అలాంటి విభిన్నమైన కథతో కొణిదెల కుటుంబం నుంచి పవన్ తేజను హీరోగా పరిచయం చేస్తూ అభిరాం దర్శకత్వంలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించిన చిత్రం "ఈ కథలో పాత్రలు కల్పితం". మనం మాములుగా ఒక సినిమా చూడకపోతే చూసినవారిని ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళు సినిమా ఎలా ఉందొ చెప్పాక ఆ సినిమా చూడాలా వద్దా అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటాం. ఇప్పుడు మీరే గనుక ఇంకా ఈ చిత్రాన్ని చూడకపోతే ఇప్పుడు మేము చెప్పే ఈ సినిమాకి చెందిన విషయాలు మిమ్మల్ని సినిమా చూడడానికి దోహదపరుస్తాయి. అవి…

ఆచార్య , సర్కారు వారి పాట , F 3 మూవీస్ పై కరోనా ఎఫెక్ట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ , చిరంజీవి - కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ -పూజాహెగ్డే జంటలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "ఆచార్య "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. "ఆచార్య "మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా "సర్కారు వారి పాట "మూవీ తెరకెక్కుతుంది. దుబాయ్ లో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. "సర్కారు వారి పాట " మూవీ 2022 జనవరి లో రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్…

ఏప్రిల్ నెలలో సినిమాల సందడి
ఏప్రిల్ నెలలో హీరోలు పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ ", నాగార్జున "వైల్డ్ డాగ్ ", నాగచైతన్య "లవ్ స్టోరీ ", నాని "టక్ జగదీష్ ", కార్తీ "సుల్తాన్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. "సుల్తాన్ "మూవీ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఏప్రిల్ 2 రిలీజ్ సినిమాలు
మార్చి నెల మొత్తం థియేటర్ల దగ్గర సినిమాల సందడితో సరిపోయింది. వారానికి కనీసం నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోగా.. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. ఇక మార్చి నెల ముగిసిపోతుంది. ఏప్రిల్ వచ్చేస్తుంది. సాధారణంగా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ల సందడి ఉంటుంది. కాకపోతే గతఏడాది కరోనా ఎఫెక్ట్ వల్ల ఈఏడాది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. మరి ఈ శుక్రవారం ఏప్రిల్ 2 న కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఒకటి నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఒకటి మరొకటి కార్తి హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా ఒకటి..

'జీ5' లో నిన్నిలా నిన్నిలా
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయి ఓటీటీ లోకి రావాలంటే కనీసం ఒక రెండు నెలలైనా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు.. థియేటర్లలోకి వచ్చిన వారంరోజుల్లోనే కొన్ని సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ముందుకువస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనీ శశి దర్శకత్వంలో.. అశోక్ సెల్వన్, నిత్యా మీనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరిలో ‘జీ ప్లెక్స్’లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి పాజిటివ్ రివ్యూస్ నే సొంతం చేసుకుంది.

అమెజాన్ లోకి వచ్చేసిన 'గాలి సంపత్'
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో 'అక్షర'
బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'అక్షర'. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలును చూపిస్తూ ఈసినిమాను రూపొందించినఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
బ్రహ్మీ-కోవై సరళ కామెడీ సీన్స్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇక బ్రహ్మీ పక్కన కోవై సరళ ఉంటే కామెడీకి కొదువే ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. వీరు ఇద్దరూ భార్య భర్తల క్యారక్టర్స్ లో చేసి ఎంతగానో మెప్పించారు. బ్రహ్మానందం డైలాగ్ కి కోవై సరళ రివర్స్ పంచ్ కి సరిపోతుంది.
పెళ్లి చూపులు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ ట్రైలర్స్
చిన్న సినిమాలతో తమ కెరీర్ నే మార్చేసుకున్న నటీ నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో పెళ్లి చూపులు సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తూనే వున్నాం. హీరోయిన్ గా చేసిన రీతువర్మ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

IIT కృష్ణమూర్తిలో ఏముంది.?
క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ పతాకంపై నూతన దర్శకుడు శ్రీవర్ధన్ దర్శకత్వంలో నూతన నటీనటులు పృద్వీ దండమూడి, మైరా దోషీ లను నాయకీనాయకులుగా పరిచయం చేస్తూ ప్రసాద్ నేకూరి నిర్మించిన సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం "IIT కృష్ణమూర్తి". ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదీన ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన విషయం తెలిసిందే..

'VIP2' ధనుష్ కామెడీ సీన్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్‌గా వీఐపీ సినిమాను తీశారు. సినిమాకు ధనుష్ స్వయంగా కథ, మాటలు సమకూర్చాడు. ఇక ఈ సినిమాలో కూడా అమలా పాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ కాజల్ విలన్ పాత్రలో నటించింది. ఈమె విలనిజం సినిమాకు ఒక హైలైట్ అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ధనుష్-అమలాపాల్‌ల జోడీ, ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, సరదా ఫైటింగ్ సాగే సన్నివేశాలు ఈ సినిమాకు మరో హైలైట్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ధనుష్ కామెడీ సీన్ మీకోసం.
IIT కృష్ణమూర్తి - మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఇక ఓవర్ ఆల్ గా చెప్పాలంటే చిన్న చిత్రమే అయినా పెద్ద ఇంపాక్ట్ ని చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'కమిట్‌మెంట్' టైటిల్ సాంగ్ రిలీజ్
హైదరాబాద్ నవాబ్స్ ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపిలేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం కమిట్ మెంట్. లవ్, డ్రీమ్,హోప్, ఫైట్ అనే నాలుగు భిన్నమైన స్టోరీలతో ఈ చిత్రం సాగుతుంది. నలుగురు మహిళల జీవితంలోకి పురుషులు ఎంటరైన తర్వాత వారి జీవితాలపై కమిట్ మెంట్ ప్రభావం ఎలా పడిందనేది సినిమా ప్రధానాంశం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా
భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన మూవీ ని మరో భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో విజయం సాధించిన మూవీస్ ని హిందీ భాషలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సెన్సేషనల్ హిట్ మూవీ "అర్జునరెడ్డి "హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ "జెర్సీ "మూవీ హిందీ లో రీమేక్ జరుపుకోనుంది. టాలీవుడ్ మూవీస్, దర్శకుల పైన బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.

అమెజాన్ లో వచ్చేసిన 90ML
బోల్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు కార్తికేయ. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యంగ్ హీరో. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు కార్తికేయ తలుపు తట్టాయి. ఇక అటుపై కార్తికేయ హిప్పీ, గుణ 369లాంటి చిత్రాలతో పలకరించి మంచి విజయాలను అందుకున్నాడు.
అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన 'సాహో'
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక్కడితో పోల్చుకుంటే హిందీలో మాత్రం ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ (భారతీయుడు ) మూవీ 1996 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగాఇండియన్ 2 (భారతీయుడు 2) భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో కమల్, కాజల్ పాల్గొంటారు.

90 కోట్ల అపజయ విజయం వినయ విధేయ రామ
జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలయిన రామ్ చరణ్ “వినయ విధేయ రామ” కు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే విపరీతమైన డివైడ్ టాక్ వచ్చింది. ఆ డివైడ్ టాక్ పట్ల ఎలాంటి డివైడ్ ఒపీనియన్ కు ఆస్కారం లేదు. యునానిమస్ గా సినిమా బాగాలేదు అని మీడియా, ట్రేడ్, పబ్లిక్ చివరకు మెగా కాంపౌండ్ అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు.

`మహానటి` తరువాత మరోసారి...
గత ఏడాది వేసవిలో విడుదలైన `మహానటి` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. `మహానటి` తెచ్చిన గుర్తింపుతో... తెలుగునాట సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఎట్టకేలకు... ఇటీవల మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ కేరళకుట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో మూడు ముఖ్య పాత్రలు ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే... `మహానటి`కి ఛాయాగ్రహణం అందించిన డ్యానీ ఈ సినిమాకి కూడా…

మొదట `మన్మథుడు` సీక్వెల్... తరువాత `సోగ్గాడే...` సీక్వెల్
గత ఏడాది `ఆఫీసర్`, `దేవదాస్` చిత్రాలతో సందడి చేసిన కింగ్ నాగార్జున... ప్రస్తుతం హిందీలో `బ్రహ్మాస్త్ర`తో పాటు తమిళ చిత్రం `రుద్రన్`తో బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రం తదుపరి సినిమాని ఇంకా ప్రారంభించలేదు. గత కొన్నాళ్ళుగా `మన్మథుడు`, `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రాల సీక్వెల్స్‌తో నాగ్ ఈ ఏడాదిలో అభిమానులను పలకరించబోతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం... త్వరలోనే ఈ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళనున్నాయని సమాచారం. అయితే... మొదట `మన్మథుడు` సీక్వెల్‌ని పట్టాలెక్కిస్తారని... ఆ తరువాతే `సోగ్గాడే చిన్ని…