ఏప్రిల్ నెలలో హీరోలు పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “, నాగార్జున “వైల్డ్ డాగ్ “, నాగచైతన్య “లవ్ స్టోరీ “, నాని “టక్ జగదీష్ “, కార్తీ “సుల్తాన్ “మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. “సుల్తాన్ “మూవీ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వకీల్ సాబ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ ఏప్రిల్ 9వ తేదీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లవ్ స్టోరీ : అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల ,నాగచైతన్యఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టక్ జగదీష్ :సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. శివ నిర్వాణ , నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్నుకోరి “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
వైల్డ్ డాగ్ : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్ ” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది హీరో నాగార్జున ఎన్ ఐ ఎ ఏజెంట్ గా నటించిన ఈ మూవీ లో దియామీర్జా , సయామీ ఖేర్ ముఖ్య పాత్రలలో నటించారు.
సుల్తాన్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు .
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: