గత కొంత కాలంగా విభిన్న కథలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆలవాలం అయింది. ఇప్పుడు అలాంటి విభిన్నమైన కథతో కొణిదెల కుటుంబం నుంచి పవన్ తేజను హీరోగా పరిచయం చేస్తూ అభిరాం దర్శకత్వంలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించిన చిత్రం “ఈ కథలో పాత్రలు కల్పితం”. మనం మాములుగా ఒక సినిమా చూడకపోతే చూసినవారిని ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళు సినిమా ఎలా ఉందొ చెప్పాక ఆ సినిమా చూడాలా వద్దా అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటాం. ఇప్పుడు మీరే గనుక ఇంకా ఈ చిత్రాన్ని చూడకపోతే ఇప్పుడు మేము చెప్పే ఈ సినిమాకి చెందిన విషయాలు మిమ్మల్ని సినిమా చూడడానికి దోహదపరుస్తాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1. కొణిదెల వారసుడిగా ఈ సినిమాతో పరిచయమైన పవన్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. చేసేది మొదటి సినిమానే అయినా ఆ ఛాయలు ఎక్కడ కనిపించకుండా చాలా పరిపక్వతతో నటనని కనబరిచాడు. బాడీ లాంగ్వేజ్, స్టైల్, మాటలు పలికిన విధానం అతన్ని తెలుగు చిత్ర సీమలో మరో ప్రామిసింగ్ నటుణ్ని చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
2. ఉమెన్ ట్రాఫికింగ్ అనే కొత్త అంశంతో తెరెకెక్కిన ఈ చిత్రం, భవిష్యత్ నిర్మించుకోవడం కోసం పట్నం వెళ్తున్న యువతులను మోసగించి ఏ విధంగా వారిని లొంగదీసుకుంటున్నారు అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు.
3. త్రిల్లర్ జోనర్ కు చెందిన సినిమాలను సరిగ్గా తెరకెక్కించకపోయినా, కథను సరైన పద్దతిలో చూపించకపోయిన ఆ చిత్ర ఫలితం తారుమారయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడం కత్తి మీద సాము చేయడం అంటారు. కానీ ఈ చిత్ర దర్శకుడు కథను చాలా గ్రిప్పింగ్ గా రాసుకొని ఆసక్తికరంగా, థ్రిల్లర్ చిత్రానికి కావాల్సిన అంశాలను జాగ్రత్తగా చూసుకొని తెరకెక్కించిన విధానం ముచ్చటగా ఉంటుంది.
4. సంగీతం ఈ సినిమాకు మరో ఆయుధం. కార్తీక్ కొడకండ్ల అందించిన సంగీతం ఈ చిత్రానికి మరొక హైలైట్. పాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సన్నివేశాలకు తగినట్టుగా కంపోజు చేసిన నేపధ్య సంగీతం ఆ సన్నివేశాలకు ప్రాణం పోశాయి.
5. హీరో చివరి వరకు ఏం చేస్తున్నాడో సగటు అభిమాని అంచనా వేయని విధంగా, అసలు ఎక్కడ తన నిజమైన వృత్తి బయటపడకుండా కథని మలచిన విధానం మాత్రం అద్భుతము .




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























