IIT కృష్ణమూర్తి – మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

IIT Krishnamurthy Is A Captivating Investigative Thriller

థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ మునుపటిలా సినిమాలు రిలీజ్ అవ్వాలంటే మాత్రం కాస్త టైం పడుతుందనే చెప్పాలి. అందుకే అప్పటివరకూ ఆగకుండా చాలా సినిమాలు ఓటీటీ వేదికనే ఆప్షన్ గా తీసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ ఓటీటీ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదే “IIT కృష్ణమూర్తి”.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ పతాకంపై నూతన దర్శకుడు శ్రీవర్ధన్ దర్శకత్వంలో నూతన నటీనటులు పృద్వీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వేదికగా ఈ సినిమా విడుదల అయింది. ట్రైలర్ తోనే ప్రేక్షకులకు ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉంది అన్న విషయం తెలియాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే. దండమూడి, మైరా దోషీ లను నాయకీనాయకులుగా పరిచయం చేస్తూ ప్రసాద్ నేకూరి నిర్మించిన సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం “IIT కృష్ణమూర్తి”.

నటీనటులు.. పృద్వి దండమూడి, మైరా దోషి, ఆనంద్, వినయ్ వర్మ, బెనార్జీ, సత్య అక్కల
దర్శకత్వం.. శ్రీవర్ధన్
నిర్మాత.. ప్రసాద్ నెకురి
సంగీత దర్శకుడు.. నరేష్ కుమారన్

కథ..

కృష్ణమూర్తి (పృద్వీ దండమూడి) IIT ముంబయి లో మాస్టర్స్ చేస్తుంటాడు. ఈ సమయంలో వాళ్ల బాబాయ్ రెండు నెలలుగా కనిపించకపోవడంతో ఆచూకీ తెలుసుకోవడం కోసం ముంబాయి నుంచి హైదరాబాద్ కి వస్తాడు. హైదరాబాద్ కి రాగానే న్యూస్ పేపర్ లో మిస్సింగ్ గా ఒక ప్రకటన ఇస్తాడు. ఆ తర్వాత అంతకు ముందు నెల క్రితం గుర్తుతెలియని మృతదేహానీకీ పోలీసులు అంత్యక్రియలు చేస్తారు. ఆ క్రమంలో అంత్యక్రియలు చేసిన మృతదేహం, ఆచూకీ లేని కృష్ణమూర్తి బాబాయిగా ధృవీకరించి కృష్ణమూర్తికి సమాచారం అందిస్తారు. వాళ్ళ బాబాయికి చెందిన వస్తువులను గుర్తుపట్టీ వాళ్ళ బాబాయి అని నిర్దారించుకుంటాడు. ఆ క్రమంలో ఒక వార్నింగ్ కాల్ కృష్ణమూర్తికి వస్తుంది. దీనితో తన బాబాయిని ఎవరో హత్య చేశారని అనుమానం వస్తుంది అతనికి. ఆ తర్వాత కృష్ణమూర్తిపై గుర్తుతెలియని వ్యక్తులు మర్డర్ అటెంప్ట్ చేస్తారు. ఇంతకీ ఆ కేస్ వెనకాల ఉన్న నిజం ఏమిటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాల్సిందే.

విశ్లేషణ..

తెలుగు ఆడియన్స్ కు థ్రిల్లర్ సినిమాలంటే ఎప్పుడూ ఇంట్రెస్ట్ తోనే ఉంటారు. ఇక సినిమా కూడా విడుదలకు ముందుగానే ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాపై ఆసక్తిని పెంచడంలో చిత్ర దర్శకుడు ముందుగానే విజయం సాధించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటినీ దర్శకుడు శ్రీవర్ధన్ సరిగ్గా తీసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే సస్పెన్స్ జోనర్లో తీసే సినిమాలు ప్రేక్షకులను ప్రతి నిమిషం ఆ చిత్రానికి అంటిపెట్టుకునే విధంగా ఉండాలి లేకపోతే అది ప్రేక్షకుల మెప్పు పొందదు. క్షణక్షణం సస్పెన్స్ తో చిత్రం సాగుతుంటేనే ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయంలో మొదటి చిత్రమే అయినా దర్శకుడు శ్రీవర్ధన్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. “బాధను గుర్తుచేసే జ్ఞాపకాలు లేకపోవడమే మంచిది”, “రూపాయి విలువ పెరిగే కొద్దీ క్యారెక్టర్ తగ్గుతుంది.” అనే మాటలు ప్రేక్షకుడి మదికి గుచ్చుకుంటాయి.

నటీనటుల విషయానికొస్తే కథానాయకుడిగా పృద్వీ దండమూడి నటన బాగుంది. మొదటి చిత్రమే అయినా కూడా కథానాయకుడిగా సినిమాను నడిపించిన విధానం బాగుంది. కథ విషయంలో ఎక్కువగా హావభావాలను పలికించే అంత స్కోప్ లేకపోయినా తన పరిధి మేర తగు హావభావాలను పలికిస్తూ చేసిన నటన ఆకట్టుకుంటుంది. ఇక ACP గా వినయ్ వర్మ నటన ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన నటన అద్భుతం. ఒక విధంగా చెప్పాలంటే ఆ పాత్రలో వినయ్ వర్మ జీవించాడని చెప్పుకోవచ్చు. కథానాయకి జాన్వీగా మైరా దోషీ పరవాలేదనిపించింది. ఇంకా మిగతా నటీనటులు తమ తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే లిమిటెడ్ బడ్జెట్ అయినా తగినంత మేర రిచ్ గా చిత్రాన్ని చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. యేసు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సన్నివేశాలను, పాటలను చాలా బాగా చిత్రీకరించాడు. నరేష్ కుమారన్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇలాంటి సస్పెన్స్ చిత్రాలకి నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంగీత దర్శకుడు అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

ఇక ఓవర్ ఆల్ గా చెప్పాలంటే చిన్న చిత్రమే అయినా పెద్ద ఇంపాక్ట్ ని చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eighteen =