IIT కృష్ణమూర్తిలో ఏముంది.?

2020 Telugu Full Movies, 2020 Telugu Movies Watch Online, IIT Krishnamurthy, IIT Krishnamurthy Full Movie, IIT Krishnamurthy Movie, IIT Krishnamurthy Movie Review, IIT Krishnamurthy Telugu Full Movie, IIT Krishnamurthy Telugu Movie, Latest Telugu Movies, Latest Telugu Online Movies, New Telugu Films 2020, Telugu Filmnagar, Telugu full length movies, Watch Online Telugu Movies

క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ పతాకంపై నూతన దర్శకుడు శ్రీవర్ధన్ దర్శకత్వంలో నూతన నటీనటులు పృద్వీ దండమూడి, మైరా దోషీ లను నాయకీనాయకులుగా పరిచయం చేస్తూ ప్రసాద్ నేకూరి నిర్మించిన సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం “IIT కృష్ణమూర్తి”. ఈ చిత్రం డిసెంబర్ 10వ తేదీన ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన విషయం తెలిసిందే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎవర్నైనా మనం ఒక సినిమాను చూడు అని సలహా ఇస్తే వాళ్ళు మనల్ని టక్కున అడిగే ప్రశ్న ఆ చిత్రాన్ని ఎందుకు చూడాలి? అని… ఆ ప్రశ్న మమ్మల్ని ఎవరైనా అడిగితే మేము చెప్పే కొన్ని అంశాలు ఆ సినిమాను ఎందుకు చూడాలో వివరిస్తాయి… ఇప్పుడు IIT కృష్ణమూర్తి సినిమాలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…!!!

1. కథ విషయానికొస్తే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్. మాములుగా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏదో ఒక చోట సినిమాను వీక్షించే ప్రేక్షకుడు వచ్చే సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందో అంచన వేయగలుగుతాడు. అలా అంచన వేయలేని చిత్రాలే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనిపించుకుంటాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా పతాక సన్నివేశం వరకు సస్పెన్స్ ను మెంటైన్ చేస్తూ, సగటు ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా కథను తీర్చిదిద్దారు.

2. ACP గా వినయ్ వర్మ నటన ఈ సినిమాకు ప్రధాన బలం. గతంలో వినయ్ వర్మ అడపాదడపా పాత్రలు పోషించినప్పటికీ ఇంత ఇంటెన్సివిటీ ఉన్న పాత్ర ఇంతకు ముందు చేయలేదనే చెప్పొచ్చు. సహజంగా ఒక పోలీస్ ఆఫీసర్ లో ఉండే లక్షణాలు అన్ని వినయ్ వర్మ తన నటనతో చూపించాడు. ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు.

3. మాములుగా సినిమాకు కథ ఎంత ముఖ్యమో ఆ కథలో లీనమయ్యే మాటలు అంతే ముఖ్యం. అందుకే మాటలను బుల్లెట్లతో పోల్చుతాం. ఈ సినిమాకు మరో ఆయుధం ఆ మాటలే. “బాధను గుర్తుచేసే జ్ఞాపకాలు లేకపోవడమే మంచిది”, “రూపాయి విలువ పెరిగే కొద్దీ క్యారెక్టర్ తగ్గుతుంది”, “మంచి ఎప్పుడైనా గెలుస్తుందని నమ్మే వ్యక్తి ఆయన. ఆయనకు తెలీదు మంచి ఎప్పుడూ గెలవదని మనమే అబద్ధాలతో, ఆయుధాలతో దాన్ని గెలిపించుకోవాలని” లాంటి మాటలు ప్రేక్షకుల గుండెకు గుచ్చుకుంటాయి. ఇలాంటి మాటలు ఈ సినిమాలో మరెన్నో ఉన్నాయి.

4. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనగానే అందులో నేపథ్య సంగీతం ప్రధాన భూమిక పోషిస్తుంది. సస్పెన్స్ ను క్యారీ చేస్తూ సన్నివేశాలకనుగుణంగా సంగీతాన్ని ఇచ్చి ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసే భాద్యత అంతా నేపధ్య సంగీతందే. అది సరిగ్గా లేకపోతే చూసేవాళ్ళు సరిగ్గా కనెక్ట్ అవ్వలేరు. కానీ ఈ చిత్ర విషయంలో సంగీత దర్శకుడు వందకు వంద శాతం విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు. టైటిల్ కార్డ్స్ పడ్డప్పటి నుంచి ఎండ్ కార్డు వరకు ఎక్కడ కొంచెం కూడా లయ తప్పకుండ ఇచ్చిన సంగీతం సూపర్. సన్నివేశాల్లో జరిగే మార్పులకనుగుణంగా తన సంగీతంలో మార్పులు చేస్తూ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని ఇచ్చాడు.

5. ఏ సినిమాకు అయిన క్లైమాక్స్ ఆయువు పట్టు. క్లైమాక్స్ బాగా లేకపోతే ప్రేక్షకులు సంతృప్తి చెందరు. వాళ్ళు తృప్తి పడకపోతే సినిమా ఫలితమే మారిపోతుంది. కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఆ మలుపు ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఆ ట్విస్టుని రివీల్ చేసేటప్పుడు వచ్చే సన్నివేశం అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క అంశాన్ని అల్లుకుంటూ ఆ సస్పెన్స్ వెనకాల ఉన్న అసలు కథ బాగుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.