హైదరాబాద్ నవాబ్స్ ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపిలేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం కమిట్ మెంట్. లవ్, డ్రీమ్,హోప్, ఫైట్ అనే నాలుగు భిన్నమైన స్టోరీలతో ఈ చిత్రం సాగుతుంది. నలుగురు మహిళల జీవితంలోకి పురుషులు ఎంటరైన తర్వాత వారి జీవితాలపై కమిట్ మెంట్ ప్రభావం ఎలా పడిందనేది సినిమా ప్రధానాంశం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమాను టైటిల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఈసినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాలో టైటిల్ సాంగ్‌ను పూర్ణాచారి రాయగా, శ్రీ కావ్య చందన, నరేష్ కుమార్ ఆలపించారు.
Here comes 1st Single from #Commitment. @DirKrish has unveiled the title songhttps://t.co/E9jOgF20sm
A Film by @Lakshmmikanth@TejaswiMadivada @amit_t1980 @ramyapasupulet1 @anveshijain #AbhayReddy @SuryaSreenivasP@ursimarsingh #NareshKumaran @MangoMusicLabel pic.twitter.com/VXIDrN8MHr
— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2020
కాగా రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్, ఫూట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై బల్‌దేవ్‌సింగ్, నీలిమ. టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























