అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా వెంటనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అగ్రిమెంట్లు రాసుకుంటే తప్పా ఓటీటీలో లేట్ గా రిలీజ్ చేస్తున్నారేమో కానీ లేకపోతే వెంటనే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈసినిమా కూడా అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. మరి థియేటర్ లో మిస్ అయినవాళ్లు ఇక్కడ చూసి ఫిఫీ లాంగ్వేజ్ ను ఎంజాయ్ చేయోచ్చు.
కాగా ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అందించాడు. లవ్లీ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: