కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 270

sivakarthikeyan ayalaan movie teaser out now
ట్రైలర్ & టీజర్

శివ కార్తికేయన్ అయలాన్ టీజర్ రిలీజ్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
anchor suma son roshans movie first look out
ఫస్ట్ లుక్

సుమ తనయుడి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇప్పటికే ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో కుర్ర హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాకు బబుల్ గమ్ అనే డిఫరెంట్ టైటిన్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ambajipeta marriage band movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుహాస్ గురించి ప్రత్యేకంగాా చెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి ఇప్పుడు హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆసినిమాతో హిట్ ను అందుకున్నాడు. తరువాత ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి పూర్తి చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Animal Movie Actor Anil Kapoor Visits Tirumala Srivari Temple
సినిమా వార్తలు

శ్రీ‌వారి సన్నిధిలో 'యానిమల్' మూవీ యాక్టర్‌ అనిల్ కపూర్‌

బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన గర్భాలయంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా అంతకుముందు తిరుమలకు చేరుకున్న అనిల్ కపూర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Bhagavanth Kesari Trailer Launch Venue Fixed
ట్రైలర్ & టీజర్

భగవంత్‌ కేసరి ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్…

Srikanth Mవాట్సాప్
prema vimanam movie trailer out now
ట్రైలర్ & టీజర్

ప్రేమ విమానం ట్రైలర్ రిలీజ్

సంతోష్‌ కట దర్శకత్వంలో సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 13న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
kiran abbavaram rules ranjann movie review
రివ్యూ

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమా అన్ని వర్గాల వారికీ కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Launches Gaaju Bomma Song From Hi Nanna Movie
సాంగ్

హాయ్ నాన్న నుండి గాజు బొమ్మ లిరికల్‌ సాంగ్ లాంచ్ చేసిన మహేష్ బాబు

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్‌ నాన్న'. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబి కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్‌ యశ్న పాత్రలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో, 'సమయమా' అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
narne nithin mad telugu movie review
రివ్యూ

మ్యాడ్ మూవీ రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఫన్ రోలర్ కోస్టర్

ఓవరాల్ గా చెప్పాలంటే లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి రెండు గంటలపాటు నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా మ్యాడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో కానీ యూత్ కు మాత్రం ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Director Sreenu Vaitla Gives Interesting Update About Gopichand 32 Movie
సినిమా వార్తలు

గోపీచంద్ 32 మూవీపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన శ్రీను వైట్ల

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో శ్రీను వైట్లది అందెవేసిన చేయి. అలాగే యాక్షన్ సినిమాలలో గోపీచంద్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేయడంతో దీనిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి 'గోపీచంద్ 32'గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమయింది.

Srikanth Mవాట్సాప్
Shivarajkumar Ghost Movie Completes Censor Works
సినిమా వార్తలు

శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ మూవీ సెన్సార్ కంప్లీట్

శాండల్‌వుడ్‌ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఘోస్ట్'. దీనికి 'వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్‌.. ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్‌' అనే కాప్షన్‌ను పెట్టారు. అంటే.. 'ఒక్కసారి గ్యాంగ్‌స్టర్‌ అయితే.. ఎప్పటికీ గ్యాంగ్‌స్టరే' అని అర్థం అన్నమాట. ఇక 'బీర్బల్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీని ఈ 'ఘోస్ట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కర్ణాటకలోని ప్రముఖ రాజకీయనేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అలానే పోసర్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. అయితే తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…

TFN Adminవాట్సాప్
Siddhu Jonnalagadda Reveals Crazy Update About Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం పై డీజే టిల్లు సూపర్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Gaaju Bomma song promo out from Hi Nanna movie
సాంగ్

హాయ్ నాన్న నుండి గాజు బొమ్మ సాంగ్ ప్రోమో రిలీజ్

దసరా తరువాత నాని హీరోగా రాబోతున్న ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్ హాయ్ నాన్న. టైటిల్ ను బట్టే ఈసినిమా ఎమోషనల్ రైడర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. పాథర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
sudheer babu Maama Mascheendra movie review
రివ్యూ

మామ మశ్చీంద్ర మూవీ రివ్యూ-బంధాల విలువలు తెలియచేసే సినిమా

ఓవరాల్ గా చెప్పాలంటే మనిషి జీవితంలో డబ్బు అనేది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజుల్లో బంధాలను పక్కనపెట్టి డబ్బుకు విలువ ఇస్తున్నారు ఎంతోమంది. ఈనేపథ్యంలో బంధాలు శాశ్వతం కానీ.. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదని చక్కని మెసేజ్ ను ఇచ్చాడు హర్షవర్థన్.ఇక డిఫరెంట్ కథలను చూడాలనుకునే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. మిగిలిన వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

TFN Adminవాట్సాప్
vijays leo movie trailer released
ట్రైలర్ & టీజర్

నెక్ట్స్ లెవల్లో లియో ట్రైలర్

దళపతి విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది లియో ట్రైలర్ గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మరోవైపు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ నుండి రిపోర్డ్ మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చినట్టే తెలుస్తుంది. లియో విజయ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
Allu Arjun wax statue to be unveiled soon in Madame Tussauds at Dubai
సినిమా వార్తలు

అల్లు అర్జున్ అరుదైన ఘనత.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. త్వరలోనే ఆయన మైనపు విగ్రహం ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్'లో కొలువుదీరనుంది. కాగా లండన్‌లోని 'మేడమ్ టుస్సాడ్స్‌' మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రముఖుల నమూనాలను వాక్స్ ఐడల్స్ రూపంలో ప్రతిష్టిస్తారు. ఈ విగ్రహాలు చూడటానికి అచ్చు ఆయా వ్యక్తులలాగే కనిపించడం వీటి ప్రత్యేకత. వీటిని సుశిక్షితులైన నిపుణులు అంత బాగా రూపొందిస్తారు. అయితే ప్రస్తుతం అనేక దేశాల్లో టుస్సాడ్స్‌ మ్యూజియాలను ఏర్పాటు చేశారు.

Srikanth Mవాట్సాప్
OG Team Released Arjun Das First Look Poster on His Birthday
ఫస్ట్ లుక్

అర్జున్‌ దాస్‌ బర్త్‌ డే.. ఓజీ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Tweets on Writer Satyanand as He Completes 50 years in TFI
సినిమా వార్తలు

రైటర్ సత్యానంద్‌కు చిరంజీవి శుభాకాంక్షలు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్

టాలీవుడ్‌లోని సీనియర్ మోస్ట్ రైటర్లలో పి. సత్యానంద్ ఒకరు. తొలితరం దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడైన సత్యానంద్ సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన 'మాయదారి మల్లిగాడు’ చిత్రంతో రచయితగా కెరీర్‌ ప్రారంభించారు. ఇప్పటివరకూ ఆయన రచయితగా 400కు పైగా సినిమాలకు పని చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇది ఒక అద్భుతమైన రికార్డుగా చెబుతుంటారు. కాగా సత్యానంద్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
venkatesh saindhava movie joins in pongal release
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో సైంధవ్- ఈసారి లెక్క మారుద్ది

వచ్చేఏడాది సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. ఇప్పటినుండే డేట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగడానికే వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ సినిమాలతో పాటు హనుమాన్, అయలాన్, లాల్ సలామ్ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని రిజర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో వెంకీ సైంధవ్ కూడా చేరిపోయింది.

TFN Adminవాట్సాప్

షేర్