అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ambajipeta marriage band movie teaser release date fixed

సుహాస్ గురించి ప్రత్యేకంగాా చెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి ఇప్పుడు హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆసినిమాతో హిట్ ను అందుకున్నాడు. తరువాత ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి పూర్తి చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. టీజర్ ను అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =