శివ కార్తికేయన్ అయలాన్ టీజర్ రిలీజ్

sivakarthikeyan ayalaan movie teaser out now

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఒకపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =