భగవంత్‌ కేసరి ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే?

Nandamuri Balakrishna's Bhagavanth Kesari Trailer Launch Venue Fixed

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్ 8న మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ట్రైలర్‌ లాంఛ్ వెన్యూని ఫిక్స్ చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. భగవంత్‌ కేసరి ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి నిశ్చయించారు. ఈ నేపథ్యంలో హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను జరుపనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విషయాన్ని తెలియజేస్తూ బాలకృష్ణ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా బాలకృష్ణ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన మూవీ టీజర్ దుమ్ము రేపింది. ఇందులో ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏళ్ళు యాదుంటాది’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ‘జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి’ స్పెషల్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశ్ యాంథమ్ పాటను విడుదల చేయగా.. అది నెట్టింట బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఉయ్యాలో ఉయ్యాలా’ అనే పాటను రిలీజ్ చేయగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.  భగవంత్ కేసరి అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ఒక్కరోజు ముందు అక్టోబర్‌ 18న యూఎస్‌ఏలో ప్రీమియర్స్ వేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.