శ్రీ‌వారి సన్నిధిలో ‘యానిమల్’ మూవీ యాక్టర్‌ అనిల్ కపూర్‌

Animal Movie Actor Anil Kapoor Visits Tirumala Srivari Temple

బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన గర్భాలయంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా అంతకుముందు తిరుమలకు చేరుకున్న అనిల్ కపూర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈరోజు అనిల్ కపూర్ నిర్మించిన ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’ హిందీ చిత్రం విడుదలైన నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్‌, రియా కపూర్, అనిల్ క‌పూర్‌లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఇక రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్‌తో పాటు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, నటాషా రస్తోగి తదితరులు ఇతర కీలక పాత్ర‌లు షోషించారు.

కాగా అనిల్ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న ‘యానిమల్’ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్‌ కపూర్‌కి అనిల్ కపూర్‌ వరుసకు బాబాయి అవుతారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్‌ వైలెంట్‌ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ ​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో ఇక్కడ కూడా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవలే రణబీర్ కపూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. మేకర్స్ ‘యానిమల్’ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన వచ్చింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 16 =