వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇప్పటికే ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో కుర్ర హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాకు బబుల్ గమ్ అనే డిఫరెంట్ టైటిన్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకధీరుడు రాజమౌళి ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ.. నటుడిగా ఆరంగేట్రం చేస్తున్నందుకు కంగ్రాట్స్ రోషన్ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అంతేకాకుండా రాజీవ్, సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను అంటూ బెస్ట్ విషెస్ అందించాడు. దీనితో పాటు ఈసినిమా గ్లింప్స్ అక్టోబర్ 10 న విడుదల చేయనున్నట్టు కూడా తెలిపారు.
Congratulations to you Roshan, on making your debut as an actor… Wishing you to make your own mark and make Rajeev and Suma garu proud. 🤗
Also, best wishes to the entire team of #Bubblegum! @RoshanKanakala @ravikanthperepu @Maanasa_chou pic.twitter.com/wvPjyNj4yU
— rajamouli ss (@ssrajamouli) October 6, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: