శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. దీనికి ‘వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్.. ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్’ అనే కాప్షన్‌ను పెట్టారు. అంటే.. ‘ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే.. ఎప్పటికీ గ్యాంగ్‌స్టరే’ అని అర్థం అన్నమాట. ఇక ‘బీర్బల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీని ఈ ‘ఘోస్ట్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కర్ణాటకలోని ప్రముఖ రాజకీయనేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘ఘోస్ట్’ సినిమాను భారీ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్టోబర్ 19న ‘ఘోస్ట్’ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం.. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. కాగా ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతోన్న చిత్రమిదని, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని తెలిపిన చిత్ర యూనిట్ ఇక క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొంది. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే హీరో శివ రాజ్‌కుమార్ ట్విట్టర్లో అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు టాలీవుడ్ హీరోలను ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే వారితో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: