
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 262


గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్డేట్

విజయ్ 68 మూవీ గ్రాండ్ లాంచ్

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్

మెగాస్టార్ 156 మ్యూజిక్ కంపోజిషన్స్ మొదలు

నాని31 లో హీరోయిన్ ఫిక్స్

నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్

ప్రేమ విమానం- 50 మిలియన్ మినిట్స్ తో రికార్డ్

జోరుగా హుషారుగా టీజర్ రిలీజ్

థ్రిల్లింగ్ గా మంగళవారం ట్రైలర్

నాని 31 అనౌన్స్ మెంట్ వచ్చేసింది

కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి కాంబో రిపీట్

చిన్న నాటి స్నేహితుడి కోసం చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో చిరు ఎప్పుడూ ముదుంటారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోసారి తన ఉదారతను చూపించారు చిరు. తాజాగా తన చిన్న నాటి స్నేహితుడికి అండగా నిలిచారు చిరు. చిరంజీవి చిన్న నాటి స్నేహితుడైన పువ్వాడ రాజ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి తన స్నేహితుడికి చికిత్సా ఏర్పాట్లు చేశారట. అంతేకాదు అపోలో ఆస్పత్రికి…

రూ. 100 కోట్ల క్లబ్‌లో 'భగవంత్ కేసరి'.. బాలకృష్ణ సరికొత్త రికార్డ్
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి…

ఉస్తాద్ భగత్ సింగ్- దసరా స్పెషల్ పోస్టర్ రిలీజ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు మరోసారి పవర్ స్టార్ తన స్వాగ్, డైలాగ్, లుక్స్ తో మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నట్టు అర్థమవుతుంది.

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' విజయం సాధించగా.. 'ఖలేజా" అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో 'గుంటూరు కారం' మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది…

ఆయుధ పూజ షురూ చేసిన దేవర టీమ్.. కొత్త పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండటం మరో విశేషం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్ హిట్ 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా…

విజయ్ 68 మూవీ గ్రాండ్ లాంచ్
దళపతి విజయ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి హిట్ ను అందించింది. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అప్పుడే తన కొత్త సినిమాపై ఫోకస్ ను పెట్టాడు. విజయ్ 68 వ సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మెగాస్టార్ 156 మ్యూజిక్ కంపోజిషన్స్ మొదలు
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఫుల్ స్పీడుమీదున్నారు. ఈవయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసేశారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు. ఆసినిమా బ్లాక్ బస్టర్ అందించింది. ఆతరువాత రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో వచ్చాడు. ఈసినిమా మాత్రం ఫ్లాప్ ను అందించింది. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.

నితిన్ ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'లో టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

నాని31 లో హీరోయిన్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫి.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్
న్యాచురల్ స్టార్ గా నాని వరుసగా సినిమాలను చేస్తూ.. సినిమాలను రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకు డిఫరెన్స్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే దసరా సినిమాతో వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దసరా సినిమాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు నాని. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో హాయ్ నాన్న సినిమా చేస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాతో మరోసారి ఎమోషనల్ యాంగిల్ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ ను నాని ఎలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

ప్రేమ విమానం- 50 మిలియన్ మినిట్స్ తో రికార్డ్
సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు అప్పటికే మ్యాడ్ సినిమాతో సంగీత్ శోభన్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈసినిమా ఈనెల 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

చంద్రముఖి2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంద్రముఖి 2 . సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో భారీ అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది చంద్రముఖి2. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

డెవిల్ నుంచి ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్‌లోని హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ శైలి వేరు. రెగ్యులర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మాళవికా నాయర్ కనిపించనుంది. కాగా ‘డెవిల్’ సినిమా నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు…

జోరుగా హుషారుగా టీజర్ రిలీజ్
రీసెంట్ గా నే బేబి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు విరాజ్ అశ్విన్. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అనుప్రసాద్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ హీరోగా జోరుగా హుషారుగా సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింద్ కానీ చాలా లేట్ అయ్యింది. ఈసినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలా గ్యాప్ తరువాత ఈమధ్యనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు కూడా. ఇప్పుడు…

భగవంత్ కేసరిలో కీలక సన్నివేశం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది

థ్రిల్లింగ్ గా మంగళవారం ట్రైలర్
ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఆతరువాత మహా సముద్రం సినిమాతో వచ్చాడు కానీ ఆసినిమా అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు మంగళవారం అంటూ కంటెంట్ ఒరియెంటెడ్ కథతో వస్తున్నాడు.

నాని 31 అనౌన్స్ మెంట్ వచ్చేసింది
నాచురల్ స్టార్ నాని 31 మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈసినిమా ను డైరెక్ట్ చేయనుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.ఈనెల 23న ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనుండగా 24న సినిమా లాంచ్ కానుంది. ఈవిషయాన్ని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా వీడియో రిలీజ్ ద్వారా ప్రకటించారు. ఇక వివేక్ ఆత్రేయ,నాని కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో అంటే సుందరానికీ తెరకెక్కింది.అయితే నాని 31ను మాత్రం వివేక్ ఆత్రేయ తన స్టైల్ కు భిన్నంగా తెరక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి కాంబో రిపీట్
ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చి యూత్ ను బాగా ఆకట్టుకుంటుండటంతో ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.