భగవంత్ కేసరిలో కీలక సన్నివేశం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం

Nandamuri Balakrishna Speech Goes Viral From Bhagavanth Kesari

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ చూసిన అభిమానులు, ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళలు.. ముఖ్యంగా చిన్నవయస్సులో ఉన్న ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య గురించి ఈ సినిమాలో చర్చించారు. అతి సున్నితమైన ఈ అంశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం, దీని గురించి హీరో పాత్రధారి అయిన నందమూరి బాలకృష్ణతో అద్భుతమైన సందేశం ఇప్పించడం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ అని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇక ఇందులో తన మునుపటి సినిమాల వలే కాకుండా ఒక సాత్వికమైన నటనతో బాలకృష్ణ ఆకట్టుకున్నారని, దీనితోపాటు మొదటిసారిగా బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం చాలా కొత్తగా ఉందని కూడా వారు అంటున్నారు.

‘భగవంత కేసరి’లోని ఆ కీలక సన్నివేశం దేని గురించి అంటే..?

‘గుడ్‌ టచ్.. బ్యాడ్‌ టచ్’.. ఈ మధ్యకాలంలో ఈ పదం గురించి తరచుగా వింటున్నాం. దురుద్దేశంతో చిన్నపిల్లలను తాకే కీచకుల గురించి వారికి తెలియజెప్పేందుకు దీనిని వాడుతున్నారు. ఈ సినిమాలో దీని గురించి ఒక కీలక సన్నివేశం ఉంటుంది. దీని ప్రకారం.. ఒకసారి ‘భగవంత్‌ కేసరి స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ చిన్నారిని ఇలా అడుగుతాడు.. ’‘పాపా.. నీకు వాడు చాక్లెట్‌ ఇచ్చి నీ మీద చేతులేస్తుంటే అది తప్పని నీకు తెలియదా?” అని. దానికి చాక్లెట్‌ తింటున్న ఆ పాప ‘ఊహూ..’ అని అమాయకంగా చెబుతుంది. అప్పుడు భగవంత్‌ కేసరి ఆ పాపను ఎత్తుకుని నేరుగా పాప చదువుతున్న స్కూల్‌కు వెళ్తాడు.

అక్కడ టీచర్లు పిల్లలకు ఎప్పుడూ చెప్పని ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం గురించి వివరంగా చెప్తాడు భగవంత్‌ కేసరి. “ప్రతిరోజూ స్కూల్‌కి దింపే ఆటో డ్రైవరు కానీ, స్కూల్లో ప్యూను కానీ, పక్కింటి అంకుల్‌ కానీ, చివరికి ఇంట్లో ఉండే తాతయ్య అయినా, అన్నయ్య అయినా.. ఆఖరికి కన్నతండ్రి అయినా సరే.. వేయరాని చోట చేయి వేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పాలి. అప్పుడు అమ్మే మిమ్మల్ని కాపాడుకుంటుంది” అని స్పష్టంగా వారికి అర్ధమయ్యేలా వివరిస్తాడు. అంతేకాకుండా ఆడపిల్లలు కలిగిన ప్రతి తల్లికీ ఉపయోగపడేలా ఈ విధంగా చెప్తాడు. “మా అడవిలో.. ‘ఇక్కడ క్రూరమృగాల తిరుగుతుంటాయి’ అని బోర్డు ఉంటుంది. కానీ ఈ సమాజంలో మాత్రం మానవ మృగాలు నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి సూచికలు ఉండవు. కాబట్టి అమ్మలే తమ బిడలకు ఆ జాగ్రత్తలు తెలియచెప్పాలి అని సూచించాడు.

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే..? సినిమాలో హీరో వేదిక మీద చెప్పింది కేవలం ఆ స్కూల్‌ పిల్లలు, వారి తల్లులకే కావచ్చు. కానీ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్క తల్లికీ, తండ్రికీ, చిన్నారికీ ఈ పాయింట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అందుకే, సినిమా కన్నా.. ప్రస్తుతం ఈ సన్నివేశం గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశం అయిందంటే.. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం జనాలకు హత్తుకుందని అర్ధమవుతోంది. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఓ అగ్ర హీరో నటించిన పక్కా కమర్షియల్‌ చిత్రంలో ఇలాంటి అంశాన్ని స్పృశించడం గమనార్హం. బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో ఈ విధంగా.. ‘ఏ మగాడైనా, వేయరాని చోట చెయ్యి వేస్తే తప్పు’ అని చిన్నపిల్లలకు చెప్పించడం నిజంగా అభినందనీయం. ఈ సందేశం జనాల్లోకి బాగా వెళ్లి, దాన్ని ప్రతి తల్లి, బిడ్డ ఆచరణలోకి తీసుకొస్తే, నేడు సమాజంలో చిన్నపిల్లలపై జరుగుతున్న ఎన్నో అకృత్యాలను, అఘాయిత్యాలను అడ్డుకోగలం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.