ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఆతరువాత మహా సముద్రం సినిమాతో వచ్చాడు కానీ ఆసినిమా అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు మంగళవారం అంటూ కంటెంట్ ఒరియెంటెడ్ కథతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమా వస్తుంది. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: