నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nithiin's Extra Ordinary Man Teaser Release Date Fixed

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’లో టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్​పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్‌. ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ టీజర్’ రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. అక్టోబర్ 30న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయదశమి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ అందులో టీజర్‌ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక ఇటీవలే విడుదల చేసిన హీరో నితిన్‌ ఫస్ట్‌ లుక్‌ మరియు ‘డేంజర్‌ పిల్లా’ అనే లిరికల్ వీడియో ప్రోమోను విడుదల చేయగా.. వీటికి మూవీ లవర్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ మూవీని డిసెంబర్ 8న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు హీరో నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమాను చేయనున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అయితే ఈ ముగ్గురి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘భీష్మ’ సినిమా సూపర్ హిట్‌ అయింది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రెండో సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 1 =