మెగాస్టార్ 156 మ్యూజిక్ కంపోజిషన్స్ మొదలు

megastar chiranjeevi 156 movie music compositions started

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఫుల్ స్పీడుమీదున్నారు. ఈవయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసేశారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు. ఆసినిమా బ్లాక్ బస్టర్ అందించింది. ఆతరువాత రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో వచ్చాడు. ఈసినిమా మాత్రం ఫ్లాప్ ను అందించింది. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకచించగా.. దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశార. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజిక్ కంపోజిషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో యూవీ క్రియేషన్స్ సంస్థ వారు ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో కీరవాణి.. చిరంజీవి అభిమానులకు శభవార్త.. యూవీ క్రియోషన్స్ 14వ సినిమా మెగాస్టార్ 156 వ సినిమా.. ఈసినిమాలో ఆరు పాటలుంటాయి.. గతంలో సినిమాను పాటల రికార్డింగుతో మొదలుపెట్టేవారు.. మళ్లీ అదే అనవాయితీని తీసుకొచ్చారు.. ఫస్ట్ ఒక సెలబ్రేషన్ సాంగ్ తో స్టార్ చేశాం..

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.