నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్

natural star nani 31 titled as Saripodhaa Sanivaaram

న్యాచురల్ స్టార్ గా నాని వరుసగా సినిమాలను చేస్తూ.. సినిమాలను రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకు డిఫరెన్స్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే దసరా సినిమాతో వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దసరా సినిమాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు నాని. ప్రస్తుతం శౌర్యువ్‌ దర్శకత్వంలో హాయ్ నాన్న సినిమా చేస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాతో మరోసారి ఎమోషనల్ యాంగిల్ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ ను నాని ఎలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అంటే సుందరానికి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటికే రాగా ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టైటిల్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు సరిపోతుందా శనివారం అనే డిఫరెంట్ టైటిన్ ఫిక్స్ చేశారు.

ఇక గ్లింప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాయి కుమార్ వాయిస్ తో మొదలైన ఈగ్లింప్స్ లో
మన పెద్దలు ఒక మాటననేవాళ్లు.. రాజుకైనా, భంటుకైనా, ఎలాంటివాడికైనా ఒకరోజు వస్తుంది.. ఆరోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూడాలి అని. అదేమాటని మన కొత్తతరం కుర్రాళ్లు ఇంకొంచెం మార్చి.. నీకంటూ ఒక టైమొస్తుందిరా.. అందాక మూసుకొని వెయిట్ చేయి అన్నారు. ఇప్పుడు మన కథ ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ల గురించో.. ఆ మాటను మార్చిన ఈ తరం వాళ్ల గురించో కాదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ తరంవాడైనా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే ఆ ఒక్క రోజు గురించే. అలాంటి రోజు.. ఆ ఒక్క రోజు వాడికి వారానికి ఒక్కసారి వస్తే.. వాడిని ఎవరైనా ఆపాలనుకోగలరా? అనుకున్నా ఆపగలరా? శనివారం.. ప్రతీ శనివారం.. సరిపోదంటారా? అంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుందో.

కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రోల నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =