దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్

game changer movie first single update

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి కూడా ఈ పండుగకు సూపర్ అప్ డేట్ తో వచ్చారు. దసరా పండుగ సందర్బంగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చారు. జరగండి అంటూ వచ్చే ఈ ఫస్ట్ సింగిల్ ను దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా.. పోస్టర్ అయితే కలర్ ఫుల్ గా ఉంది. మరి పాట కూడా ఇదే కలర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.