కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి కాంబో రిపీట్

anand deverakonda and vaishnavi chaitanya new movie announced

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చి యూత్ ను బాగా ఆకట్టుకుంటుండటంతో ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది. తాజాగా ఈసినిమా కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సముద్రం దగ్గర బోట్ మీద వైష్ణవి కూర్చొని ఉండగా.. ఆనంద్ దేవరకొండ మోకాళ్లమీద కూర్చొని వైష్ణవి ముఖాన్ని పట్టుకుంటాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

కాగా బేబి సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాతగా కూడా మారడం విశేషం. మరోవైపు ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు కూడా తెలిపారు. దీనితో పాటు వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా న రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు. మరి బేబి సినిమాతో సంచలనం సృష్టించిన ఈ కాంబో ఈసినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =