
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 255


కన్ఫామ్.. హిందీ లో బేబి రీమేక్

కోట బొమ్మాళి పీఎస్ టీజర్ రిలీజ్

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఈగల్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన రవితేజ

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ట్రైలర్ రిలీజ్

కింగ్ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమో రానుంది

భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ వేదిక ఫిక్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే మూడో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా గా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకున్నాయి. మూడు వారల్లో ఈసినిమా దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

కన్ఫామ్.. హిందీ లో బేబి రీమేక్
చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఈనేప్యథ్యంలోనే ఇప్పటికే మన తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లను అందుకుంటున్నారు. ఇప్పుడు ఈసినిమా కూడా రీమేక్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

యాత్ర 2 నుండి సోనియా గాంధీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి…

కోట బొమ్మాళి పీఎస్ టీజర్ రిలీజ్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

ఓటీటీలో కూడా హవా చూపిస్తున్న మ్యాడ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

కమల్ థగ్ లైఫ్ నుండి కీలక పాత్రల పోస్టర్లు రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా 1987 లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు దాదాపు 36ఏళ్ల తరువా మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. క్లాసిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు.

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ రిలీజ్ డేట్ ఫిక్స్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా పోస్టర్లను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

సలార్- కేరళ లో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో ప్రొడక్షన్ హౌస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
కమల్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు చిత్రయూనిట్. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది.

కీడా కోలా యూఎస్ లో బ్లాస్టింగ్ కలెక్షన్స్
మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని లేటెస్ట్ గా కీడా కోలా సినిమాతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి రిలీజ్ కు ముందే ఈసినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాడు తరుణ్ భాస్కర్. అసలు కథను ఎక్కడా రివీల్ చేయకుండా మంచి బజ్ క్రియేట్. ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ థ్రిల్లర్ కావడంతో అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

దిల్ రాజు సొంత ఓటీటీ రూమర్లపై టీమ్ క్లారిటీ
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన నిర్మించిన సినిమాల్లో కొద్ది సినిమాలు తప్పా చాలా సినిమాలు విజయాలే అందుకున్నారు. అందుకే దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా పేరు పడిపోయింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు.

భగవంత్ కేసరి కలెక్షన్స్ ఎంతో చెప్పేసిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి.ఈదసరా సీజన్ లో థియేటర్లోకి వచ్చి విన్నర్ గా నిలిచింది.ఈసినిమా విడుదలై మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేట్రికల్ బిజినెస్ తో సహా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పేశారు.భగవంత్ కేసరి 57.63కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా 18రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70.01 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ విషయానికి వస్తే 131.19కోట్లు అని నిర్మాతలు పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ కలెక్షన్స్ ప్రకారం అయితే ఈసినిమా బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొచ్చినట్లే.

హాయ్ నాన్న రిలీజ్ తర్వాత మృణాల్‌ని అందరూ అలా పిలుస్తారు - నాని
'హాయ్ నాన్న' రిలీజ్ తర్వాత మృణాల్‌ని అందరూ 'యశ్నా' అని పిలుస్తారని చెప్పారు నేచురల్ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. తండ్రీ,కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్ యశ్న పాత్రలో 'సీతారామం' ఫేమ్ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ…

కన్నప్ప కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దానికితోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో సినిమాకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా షూటింగ్ సమయంలో విష్ణు కు ప్రమాదం జరిగి స్వల్ప గాయాలయ్యాయి

ఈగల్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన రవితేజ
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే గోపీచంద్ మలినేనితో RT4GM చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అలాగే రవితేజ కథానాయకుడిగా చేస్తోన్న మరో లేటెస్ట్ మూవీ 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ నటించిన సినిమాలు 'ధమాకా', 'డిస్కో రాజా' చిత్రాలకు ఆయన డీఓపీగా పనిచేయడం తెలిసిందే. ఇక క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా 'ఈగల్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల…

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ప్రోమో రిలీజ్
ద వెయిట్ ఈజ్ ఓవర్.. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ ను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారో అప్పటి నుండి ఆ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దమ్ మసాలా అంటూ వచ్చే ఈసాంగ్ ప్రోమో అదిరిపోయింది. థమన్ మ్యాజిక్.. మహేష్ విజువల్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి.సంజిత్ హెగ్డే పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి…

ట్రెండింగ్ లో జవాన్ త్రీ వెర్షన్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ గత సెప్టెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈసినిమా ఇప్పటివరకు 1100కోట్లకుపైగా రాబట్టి ఈ ఈఏడాది బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా తో వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు షారుక్.ఈసంక్రాతి కి వచ్చిన పఠాన్ తో మొదటి సారి ఈ క్లబ్ లో చేరాడు.ఇక జవాన్ రెండు రోజుల క్రితం ఓటిటి లోకూడా విడులైయింది.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ట్రైలర్ రిలీజ్
కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

కింగ్ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?
తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక విజయవంతమైన చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. అచిరకాలంలోనే తనదైన ప్రతిభ చూపి తండ్రికి తగిన వారసుడు అనిపించుకున్నారు. అలాగే తండ్రి తదనంతరం అన్నపూర్ణ స్టూడియో అధిపతిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫిల్మ్ స్కూల్ స్థాపించి ఉత్సాహవంతులైన యువతీ, యువకులకు నిపుణులైన సిబ్బందితో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నారు. ఇంకోవైపు ఇతర బిజినెస్ పనులతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతుంటారు.

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమో రానుంది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని ఈ మొదటి పాట ధమ్ మసాలా ప్రోమోను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.రేపు ఉదయం 11:07 గంటలకు ఈసాంగ్ ప్రోమోను వదులనున్నారు.ఈ ప్రోమో లో ఫుల్ సాంగ్ ఎప్పుడు రానుందో చెప్పనున్నారు.ఈనెల 7న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ఈ సాంగ్ పై మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.అయితే వారి అంచనాలను అందుకునే విధంగా తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట.సో ఫస్ట్ సాంగ్ చార్ట్ బాస్టర్ కావడం పక్కా.ఇక ఈసందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో…