కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

kamal haasan and mani ratnam movie title revealed

కమల్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు చిత్రయూనిట్. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రేపు కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు నుండే సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టైటిల్ ను గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =