టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన నిర్మించిన సినిమాల్లో కొద్ది సినిమాలు తప్పా చాలా సినిమాలు విజయాలే అందుకున్నారు. అందుకే దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా పేరు పడిపోయింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు దిల్ రాజు పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు సొంతగా ఓటీటీ ఫ్లామ్ ను ప్లాన్ చేస్తున్నట్టు పలు వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయి దిల్ రాజు టీమ్ వరకూ వెళ్లాయి. దీంతో దిల్ రాజు టీమ్ ఈ వార్తలపై స్పందిస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ట్వీట్ చేస్తూ.. దిల్ రాజు ఓటీటీ ప్లాట్ ఫాం ప్రారంభిస్తున్నాడన్న వార్తలను ఖండిస్తున్నా.. దిల్ రాజుపై వస్తున్న పుకార్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజంలేదని, నిర్ధారణ కాని ఇటువంటి వార్తలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
We express our strong disapproval of the rumors concerning our producer, Mr. Dil Raju Garu, commencing an OTT platform. We request everyone to please refrain from spreading unverified information.
— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: