మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని లేటెస్ట్ గా కీడా కోలా సినిమాతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి రిలీజ్ కు ముందే ఈసినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాడు తరుణ్ భాస్కర్. అసలు కథను ఎక్కడా రివీల్ చేయకుండా మంచి బజ్ క్రియేట్. ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ థ్రిల్లర్ కావడంతో అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఫస్ట్ డే 6 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు ఏకంగా 9 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. మూడు రోజుల్లో ఈసినిమా అక్కడ 500 కే డాలర్లను కలెక్ట్ చేసింది. త్వరలోనే 1 మిలయన్ డాలర్ కలెక్ట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
There’s no stopping our Keedaa.! Crossed half a million mark in the USA already🤩#KeedaaCola #BlockbusterKeedaaColahttps://t.co/EOjsaM8LZ2@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @RaftarCreations pic.twitter.com/Me3ru8Q0Au
— VG Sainma (@VGSainma) November 6, 2023
కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో ఈసినిమా వచ్చింది. ఈసినిమాను .విజి సైన్మా బ్యానర్ పై భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మించగా.. సంగీతం.. వివేక్ సాగర్, సినిమాటోగ్రఫి.. ఎజె ఆరోన్ అందించాారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: