ఈగల్‌ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన రవితేజ

Ravi Teja's Eagle Teaser Released

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే గోపీచంద్ మలినేనితో RT4GM చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అలాగే రవితేజ కథానాయకుడిగా చేస్తోన్న మరో లేటెస్ట్ మూవీ ‘ఈగల్‌’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ నటించిన సినిమాలు ‘ధమాకా’, ‘డిస్కో రాజా’ చిత్రాలకు ఆయన డీఓపీగా పనిచేయడం తెలిసిందే. ఇక క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘ఈగల్‌’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ వదిలారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా ‘ఈగల్’ టీజర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఇందులో మాస్‌ మహారాజా విధ్వంసం అంటే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ అర్ధమయ్యేలా చూపించారు. రవితేజ అదరగొట్టేశారు. ఈ సందర్భంగా రవితేజకి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు రైఫిల్ పట్టుకుని రవితేజ సీరియస్ లుక్ తో కనిపించారు. మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు.. అంటూ మేకర్స్‌ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. టీజర్ చూస్తుంటే.. మొత్తానికి రవితేజ ఈసారి సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారు.

ఇక ‘ఈగల్‌’లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా.. డేవ్ జాంద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ అండ్ ‘ఈగల్‌’ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 8 =