బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ గత సెప్టెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈసినిమా ఇప్పటివరకు 1100కోట్లకుపైగా రాబట్టి ఈ ఈఏడాది బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా తో వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు షారుక్.ఈసంక్రాతి కి వచ్చిన పఠాన్ తో మొదటి సారి ఈ క్లబ్ లో చేరాడు.ఇక జవాన్ రెండు రోజుల క్రితం ఓటిటి లోకూడా విడులైయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీతోపాటు తెలుగు తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.అయితే థియేటర్ వెర్షన్ కాకుండా ఎక్స్టెండెడ్ వెర్షన్ ఓటిటి లోకి వచ్చింది.ఈసినిమా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇన్ ఇండియాలో వరుసగా మొదటి స్థానంలో హిందీ వెర్షన్ తరువాతి రెండు స్థానాల్లో తెలుగు,తమిళ వెర్షన్ లు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.అట్లీ ఈసినిమా ను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.రెడ్ చిల్లీస్ ఈసినిమాను నిర్మించింది.
ఇదిలాఉంటే ఈ ఏడాది మరో సినిమా తో రానున్నాడు షారుక్. ఆయన నటిస్తున్న డంకి ఈ క్రిస్మస్ కి విడుదలకానుంది.రీసెంట్ గా ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే డంకి కూడా షారుక్ కు 1000కోట్ల సినిమా అయ్యలానే వుంది.రాజ్ కుమార్ హిరానీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా విక్కీ కౌశల్,తాప్సి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























