మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా పోస్టర్లను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నట్టు అప్ డేట్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈసినిమాను డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు.నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























