చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఈనేప్యథ్యంలోనే ఇప్పటికే మన తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లను అందుకుంటున్నారు. ఇప్పుడు ఈసినిమా కూడా రీమేక్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమలో పాల్గొన్న అల్లు అరవింద్ ఈవిషయాన్ని తెలియచేశారు. బేబి నిర్మాత ఎస్ కే ఎన్ హిందీలో ఈసినిమా రీమేక్ ను చేయనున్నాడని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. హిందీలో ఎవరు నటిస్తారో చూడాలి.
కాగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విని ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: