ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాతో పాటు పలు సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటికి గట్టి పోటీ ఇస్తూ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. నవంబర్ 3వ తేదీన ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ లో కూడా తన సత్తా చాటుతుంది. టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈసినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచి సెకండ్ ప్లేస్ లో దూసుకుపోతుంది.
కాగా ఈసినిమాలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లుగా నటించగా.. మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు తదితరులు పలు కీలకపాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్య దేవర తొలిసారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సమర్పకుడిగా ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సంగీతం.. భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫి..దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























