గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ప్రోమో రిలీజ్

guntur kaaram movie first single dum masala song promo out now

ద వెయిట్ ఈజ్ ఓవర్.. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ ను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారో అప్పటి నుండి ఆ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దమ్ మసాలా అంటూ వచ్చే ఈసాంగ్ ప్రోమో అదిరిపోయింది. థమన్ మ్యాజిక్.. మహేష్ విజువల్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి.సంజిత్ హెగ్డే పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఫుల్ సాంగ్ ను 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో అలరించనున్నాడు మహేష్. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.

ఈసినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా.. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =