కింగ్ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా?

Akkineni Nagarjuna Reveals His Mouth Watering Cheat Meal

తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక విజయవంతమైన చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. అచిరకాలంలోనే తనదైన ప్రతిభ చూపి తండ్రికి తగిన వారసుడు అనిపించుకున్నారు. అలాగే తండ్రి తదనంతరం అన్నపూర్ణ స్టూడియో అధిపతిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫిల్మ్ స్కూల్ స్థాపించి ఉత్సాహవంతులైన యువతీ, యువకులకు నిపుణులైన సిబ్బందితో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నారు. ఇంకోవైపు ఇతర బిజినెస్ పనులతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే.. టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున ఆరుపదుల వయస్సులోనూ తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలతో పోటీపడుతూ వారికి ఏమాత్రం తీసిపోకుండా సినిమాల పరంగానూ దూసుకెళ్తున్నారు. ఒకవైపు ఆయన ఇరువురు కుమారులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నప్పటికీ వారితో సమానంగా ఆయన కూడా చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. నాగార్జున పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అంశాలపై ఆయన అభిమానులకే కాకుండా, సినీ ప్రియులకూ ఆసక్తి ఉంటుంది. ఆయనకి ఇష్టమైనవి ఏంటి? ఇష్టమైన ఫుడ్ ఏంటి? వంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంటుంటారు. దీని గురించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

అయితే ఇంతకూ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్ ఏదో తెలుసా? దీనికి సమాధానం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాజాగా నాగార్జున ఒక మీడియాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనగా.. అందులో ఆయన తనకిష్టమైన ఫుడ్ గురించి తెలిపారు. ‘హాట్ రైస్’, ‘హాట్ చారు’ ‘నెయ్యి’ అండ్ ‘హాట్ చిప్స్’.. ఇవంటే తనకి ఎంతో ఇష్టం అని ఆయన వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించి కింగ్ నాగార్జున చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం నాగార్జున ‘నా సామి రంగ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =