భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ వేదిక ఫిక్స్

bhagavanth kesari box office ka sher celebrations event venue fixed

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే మూడో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా గా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకున్నాయి. మూడు వారల్లో ఈసినిమా దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇంత ఘన విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. బాక్సాఫీస్ కా షేర్ సెబ్రేషన్స్ పేరుతో ఈ ఈవెంట్ ను జరపనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ ఈవెంట్ వేదికను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. నవంబర్ 9 వ తేదీన హైద్రాబాద్ లోని కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది.

కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.