
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 246


గూఢచారి 2 పెద్ద స్పై ఫిలిం

రివ్యూ : ఆదికేశవ

పైలట్ స్పెషల్ నోట్.. ఆనంద్ దేవరకొండ స్పందన ఇదే

హనుమాన్ సౌండ్ మిక్సింగ్ పనులు ప్రారంభం

ధ్రువ నక్షత్రం- మరోసారి రిలీజ్ వాయిదా

యానిమల్ ట్రైలర్ పై ప్రభాస్ రియాక్షన్

మైసూర్ లో మొదలైన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్

కంగువ షూట్ లో గాయపడిన సూర్య

మెగా 156 షూటింగ్ షురూ

అదిరిపోయిన యానిమల్ ట్రైలర్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా చిత్రయూనిట్ ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తూ రిలీజ్ సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటకే పలు పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈ…

గూఢచారి 2 పెద్ద స్పై ఫిలిం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఈసినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈసినిమాను ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసిన లియో
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లియో. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తమిళ్ లో అయితే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోగా.. తెలుగులో కాస్త మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ న సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

రివ్యూ : ఆదికేశవ
ఓవరాల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చిన ఈ ఆదికేశవ టైం పాస్ చేయిస్తాడు.హీరో హీరోయిన్ల యాక్టింగ్, డ్యాన్స్ ,సంగీతం,క్లైమ్యాక్స్ హైలైట్ అయ్యాయి.పెద్దగా అంచనాలు లేకుండా వెళితే రెండు గంటలు ఆదికేశవ ఎంటర్ టైన్ చేస్తాడు.

పైలట్ స్పెషల్ నోట్.. ఆనంద్ దేవరకొండ స్పందన ఇదే
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తాను ప్రయాణం చేస్తున్న విమాన పైలట్ ప్రత్యేకంగా లేఖ రాయడంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అసలేమైందంటే..? ఇటీవల ఆనంద్ దేవరకొండ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా సదరు విమాన పైలట్ సుభాష్.. ఆనంద్ నటనను మెచ్చుకుంటూ స్పెషల్‌గా ఒక లేఖ రాసి అందించారు. ఆ లేఖలో.. ‘బేబి’ చిత్రం చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ సినిమాలో అద్భుతంగా నటించి ఆనంద్ తన మనసు గెలుచుకున్నాడని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. అలాగే, తన బ్రదర్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు…

డబుల్ ఇస్మార్ట్ సాలిడ్ అప్‌డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

ప్రభాస్ స్పిరిట్ లో నటించడంపై.. రణ్‌బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలై ట్రైలర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే 'కబీర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి…

హనుమాన్ సౌండ్ మిక్సింగ్ పనులు ప్రారంభం
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

ధ్రువ నక్షత్రం- మరోసారి రిలీజ్ వాయిదా
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ధ్రువ నక్షత్రం. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్ లో నటిస్తున్నాడు విక్రమ్.

ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఈసినిమాతో అనిల్ రావిపూడి లిస్ట్ ల ఖాతాలో మరో సినిమా చేరిపోవడమే కాకుండా బాలకృష్ణకు హ్యాట్రిక్ ఇచ్చింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను అందించింది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

యానిమల్ ట్రైలర్ పై ప్రభాస్ రియాక్షన్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇక ఈసినిమా ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు…

ఒకే ఫ్రేమ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్.. ఫొటోస్ వైరల్, ఖుషీ అవుతోన్న ఫ్యాన్స్
కోలీవుడ్ టాప్ హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇరువురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈ స్టార్ హీరోలు ఇద్దరూ 2 దశాబ్దాల తర్వాత చెన్నైలోని ఒకే స్టూడియోలో తమ కొత్త సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో కమల్ హాసన్, రజనీకాంత్ ఆప్యాయంగా పలకరించుకుంటూ, నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఫోటోలను పంచుకుంది.

మైసూర్ లో మొదలైన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

కంగువ షూట్ లో గాయపడిన సూర్య
సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చెన్నైలో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సూర్య గాయపడినట్టు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో సూర్య భుజం మీద కెమెరా పడినట్టు తెలుస్తోంది. దీంతో సూర్య భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి…

కీర్తి సురేష్ చేతులమీదుగా.. టీ20 మ్యాచ్ ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభం
కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు నేషనల్ అవార్డు విన్నర్ నటి కీర్తి సురేష్. ఈ మేరకు ఆమె కేరళలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ సమక్షంలో కీర్తి సురేష్ ఈ సేల్‌ను ప్రారంభించారు. కాగా నవంబర్ 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

మెగా 156 షూటింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. అంతేకాదు మ్యూజిక్ సెషన్స్ కూడా మొదలుపెట్టారు.

అదిరిపోయిన యానిమల్ ట్రైలర్
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ముందు కాంబినేషన్ కే ఈసినిమాకు క్రేజ్ పెరగగా ఆ తరువాత టైటిల్ దగ్గర నుండి రిలీజ్ అయి ప్రతి అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెంచాడు తప్పా ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు సందీప్ వంగా. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే టీజర్ ను బట్టి అర్థమైపోయింది. ఈసినిమాలో రణబీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ తరహాలో ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నాడు.

లాల్ సలామ్- లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ డబ్బింగ్ కంప్లీట్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూర్తిచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో కపిల్ దేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు కపిల్ దేవ్. ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

బబుల్ గమ్- చిరు రిలీజ్ చేసిన ఇజ్జత్ సాంగ్
నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

దూత ట్రైలర్ రిలీజ్.. జర్నలిస్టుగా అదరగొట్టిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'దూత'. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టబోతున్నారు. 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ దూత వెబ్ సిరీస్.. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా ఈ 'దూత' వెబ్ సిరీస్ డిసెంబర్ 1న…