అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘దూత’. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టబోతున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ దూత వెబ్ సిరీస్.. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా ఈ ‘దూత’ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా గురువారం (నవంబర్ 23, 2023) హీరో నాగచైతన్య జన్మదినం సందర్భంగా.. ఆయన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘దూత’ అఫీషియల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ‘లెక్కపెట్టలేనన్ని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు.. వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది’ అంటూ సిరీస్ గురించి వివరించారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇందులో.. చైతన్య మాంచి ఇంటెన్స్ లుక్‌తో అదరగొట్టారు. సమాజం పట్ల బాధ్యత, వృత్తి పట్ల నిబద్దత కలిగిన జర్నలిస్టు సాగర్ గా కనిపించిన ఆయన.. ఒక ముఖ్యమైన కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ‘దూత’ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: