దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లియో. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తమిళ్ లో అయితే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోగా.. తెలుగులో కాస్త మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ న సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతంచేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈసినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Singam @NetflixIndia la irangunaa naattukae virunthu 🦁#Leo 🔥This is how he gonna playhttps://t.co/hFeauwzaP8#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @menongautham@MadonnaSebast14@manojdft @philoedit @anbariv… pic.twitter.com/zlAEojyRoI
— Seven Screen Studio (@7screenstudio) November 24, 2023
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























